సిరిసిరి మువ్వలు

పల్లవి

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు
చిరిచిరు ఆశలు ఈ గలగల ఊసులు
కలబోసి చేసినవి కిలకిల నవ్వులు
వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు
దేవుడే ఆ దివినుండి పంపిన దీవెనలు
ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు ||సిరి||

చరణం 1

అల్లరంతా సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటే హొయ్‌
నిలువలేక నిశబ్ధమే విసుగుపుట్టి పోదా
సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని
కన్నీరు చేరుకుంది తెనగవ్వే మనకళ్లని
ఈ మణికాంతి వెలుగుతూ వుంటే ||2||
చీకటి రాదే కన్నుల కెదురుగా ||సిరి||