హాయ్‌రుక్కు

పల్లవి

[అతడు] హాయ్‌రుక్కు రుక్కు మామ్‌ ||3||
నీ గుట్ట విప్పువాసి గుట్టు చెప్పవాహే చికుబుకురుక్కుమామ్‌ ||ఆయ్‌||
[ఆమె] షికారు వెళ్ళదాం
[అతడు] వెళ్ళాకా
[ఆమె] సినిమాలు చూద్దాం
[అతడు] ఆ చూశాకా
[ఆమె] షాపింగ్‌ చేద్దాం
[అతడు] ఆ చేశాకా
[ఆమె] చపాతీ తింద్దాం
[అతడు] ఆ తిన్నాకా
[ఆమె] తిన్నదంత అరిగేట్టు ముద్దు మీద ముద్దపెట్టు ||హేయ్‌||
[ఆమె] హాయ్‌రుక్కు రుక్కు మామ్‌ చిలకముక్కు రుక్కుమామ్‌ ||2||
చెరుకుముక్క రుక్కుమామ్‌ రుక్కురుకురుక్కుమామ్ ||హాయ్‌||

చరణం 1

[ఆమె] జూపార్కు వైపు పరుగుతీద్దాం
చెట్టు చాటు పొదలో చొరవు చేద్దాం
[అతడు] గోల్‌కొండ వైపు అడుగులేద్దాం
పాడుబడ్డ గృహంలో ఆడుకుందాం
[ఆమె] నక్షత్రశాలకు పోదాం నేడు సాక్షాత్తు స్వర్గం చూద్దాం
[అతడు] షామీర్‌పేటకు సిద్ధం చలికోనేటి స్నానం చేసేద్దాం ||హేయ్‌||

చరణం 2

[అతడు] ఉస్మానీయలో చదువుకుందాం
ప్రేమలోన డాక్టరేటు పుచ్చుకుందాం
[ఆమె] అసెంబ్లీహాల్లో హాజరవుదాం
ప్రేమగుర్తు జండా ఎగురవేద్దాం
[అతడు] ఆకాశవాణికి పోదాం మన అందాల వార్తలు చెబుదాం
[ఆమె] ఆపైన మార్కెటుకు వెళ్ళదాం
అయిదు కేజీలు మల్లెలుకొని తెద్దాం ||హాయ్‌||