నమ్మలేనంతగా నేడు

కొన్ని పుష్కరాల క్రితం తెలుగుజాతి వృక్షం పుష్పించిది
పుష్పించి వివిధ శాఖల ఏకత పరీమళాల శోభలను గుప్పించింది
పువ్వు ఫలంగా పరిణామం చెందే పరిణతి దశలో
నవ్వుల పలైంది తెలుగుజాతి నమ్మలేనంతగా నేడు

తెలుగు జాతి వెలుగు జాతి భాషా ప్రాతిపదిక ప్రమిదలో
ఐక్యత కాంతులు ప్రసరించిన దినం నాడు ముక్కోటి తెలుగువారి
మూడు ప్రాంతాలను ముల్లెవేసి మంగళ సూత్రంలా బంధించిన
దినం నాడు సస్యశ్యామల సంభరిత శోభావృత ప్రాంతములు
సోదర భావ సంపన్నతి నందిచ్చి వాత్సల్యామృతం గర్వంగా పంచుకున్న
దినం నాడు కల్ లీడే రాలని తెలుగుజాతి జగత్కల్యాణ సంఘటిత

ప్రమాదాలకు కంకణం కట్టుకున్న దినం నాడు శ్రీ రాములు దయచేతనుఆరూఢిగ
సకల జనులు నౌరాయనగా అవతరించిన సంఘటిత తెలుగు దేశం ఆయన
రక్తాశ్రువుల జనించిన గారాలు పట్టి పుట్టిన దినం నాడు తరతరాలు తెగి విడివడిన
తమ రావృత త్రిలింగ దేశం పరస్పర ప్రేమాస్పద స్పందనలో ఆనందపు దివ్వెలు
వెలిగించిన దీపావళి నాడు ఆనాడు నేడై మోడుగా మారితిరి కలలన్ని శిలలై కూకటి

వ్రేళ్ళ ప్రసరణ స్థంభన చేసింది కొద్ది తుఫాను గాలి చాలు వాలి
రాలి పోడానికి అశోకుడు నాటిన వృక్షం అక్బరు పెంచిన చెట్టు
అన్నీ బోధించే దొకటే ఆ నీడలో అనురాగ స్పందనం
చరిత్ర చెరిగి పోయినా చెట్టు కనిపించక పోయినా
ఫలరసాస్వాదనలో ఆనాడు ఫలించినవి జాతి ఆశలు
ఆశయాలు పువ్వు ఫలంగా పరిణయం చెందే పరిణత దశలో

నవ్వుల పాలైందితెలుగు జాతి నమ్మలేనంతగా నేడు
ఉమ్మడి కుటుంబాలు గుమ్ముగా కలిసి బ్రతుంకుతున్నాయి
దేశాంతర పరిణయాల జంటలు హాయిగా కలిసి జీవిస్తున్నారు
సర్వ జీవ జాల జాతుల్లో అనైక్యత లేనే లేదు ఒకే గూటి పక్షుల్లో
వేరు బ్రతుకు మిధ్య కాని తెలుగుజాతి గూటిలో తెగులొకటి ఉద్భవించింది

తెలుగు భూమి బ్రద్దలయే భూకంపన శబ్దించింది నాడు నేడై మాడిన
మాడు రూపంలో ప్రతిబింబిస్తోంది కొన్ని పుష్కరాల క్రితం తెలుగుజాతి
వృక్షం పుష్పించింది పుష్పించింది వివిధ శాఖల ఏకత పరీమనాలను గుప్పించింది
తెలుగు జాతి వృక్షానికి తోటమాలి ఎవరైతేనేం?కాలం పరిధిలో ఐక్యత

తోయం పోయాలి కాని పుష్ప పరిమళాలు ఫలరసాల చైత్న్యం
పంపకం ఔచిత్యంతో ఫలప్రదం కావాలి నరకాసుర వధతో దీపావళి
వెలసింది నాడు నరాసురులిచ్చే వ్యధలు బాపితేనే దీపావళి నేడు
అసుర శక్తులను మడించిన గత తప్పిన మతుల నఖ్యాతంలోకి త్రోసి
సంతృప్తి సమాధులు కట్టాలి శాతవాహనుల సహస్త్ర శతజయంతులు
ప్రతాపరుద్రుని సర్వాంధ్ర గర్వకీర్తి కృష్ణరాయని కర్ణాకర్ణ ధీధీతి నన్నయ
తిక్కనల భారత కవితా సౌరభాలు బమ్మెర పోతల జగబ్ద్భిత భాగవత

కర్పూర హారతి గత చరిత్రలోంచి దాతలు వల్లించే కీర్తి మాతలు
దరిద్ర నారాయణుడవు నీవు వీటిపై వరభాగ్యోన జీవిగా
బ్రతకడం దేనికి వర్తమాన చరిత్ర పుటలు భవిష్యత్తుకు
ఉజ్జ్వల బాటలు కావాలి వంకర గుంటల బాటలు
చరిత్ర వాహనానికే ముప్పు రుతువుల రపిడిలో
వృక్ష స్వరూపం మారినా స్థిత ప్రజ్ఞ కూడిన సజీవ

శక్త్రి నిత్యం వెల్గాలి దేశసర్వతోముఖ సంపన్నత అణువే
దేశ వృద్ది జాతుల బహుముఖ ఉద్దివనమే దేఅశ వృద్ధి
తరాల నుంచి మరలుగా పనిచేసే మానవ బుద్ది
భారత నూతన చైత్న్య వ్లసిత సమాజానికే వద్దు
తెలుగుజాతి వెలుగు జోతిరోషద్వేషాల నుసి ప్రమిదతో
శాంతిద్రవ ఆద్రతతో ఐక్యకాంతులు వెదజల్లాలి నేడు