బాలలం బాలలం

బాలలం బాలలం మేమంత బాలలం
కన్న తల్లిదండ్రులకు కదలాడే బొమ్మలం
భరతమాత పెంచుతున్న భావి మావి కొమ్మలం
చదువుకునే దీపాలం సమత నాత రూపాలం
నవ భారత మందిరాన నవ జీవన శిల్పాలం