చెలి చమకు కనులు వల

పల్లవి

[అతడు]చెలి చమకు కనులు వల వేసెనులే తొలిగా తొలిగా
తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగా జతగా
ఆశ నడుమే నయగారా అడుగేసె నను చేరా ||చెలి||

చరణం 1

[ఆమె]సింహమల్లె పొగరు ఉంది నన్ను గిచ్చి చంపుతుంది
చక్కిలి నొక్కా చేరరా పక్కా
[అతడు] వన్నె చిన్నె ఉన్నా కన్నె లాగామాకి పైకి నన్నే
సెగతొ నా మది పోయెనంది పరువం మడతడిపోవునే
[ఆమె] అంత మగసిరి నీలోనా ఉన్నది కదా మరి రావా
చప్పునొచ్చెయ్ వచ్చి వాటయ్ చురుకలే వేసెయ్
[అతడు] అంతగా త్వరపడలేనులే నా మదిలో చోటిక లేదులే
[ఆమె] ఆడకు కధకళి ఆటలే ఏ పాడకు చలిగిలి పాటలే ||చెలి||

చరణం 2

[అతడు]ఏరూపు చూపి కవ్విస్తారు గుండె పిండి చంపుతారు
మగువల జన్మ అరె ఏంటిరా బ్రహ్మ
[ఆమె]అవును అంటే కాదు అనెలే కాదు అంటే అవును అనెలే
చల్లగా అల్లుకుపోవులే మా చూపుల భాషలు వేరులే
[అతడు]ఆశ కలిగెను నీపైనా అల్లరి పెరిగెను లోనా
రా సురేఖా జెట్ట లేకా ఏమిటో తడబాటు
[ఆమె]గుప్పెడు మనసున ఆశలు నెరవేరవు పూర్తిగా ఊహలు
[అతడు]చెప్పకు పొడి పొడి మాటలే అనుకున్నవి అందితే హాయిలే