రంగు రంగుల పూవులోయ్
కమ్మ కమ్మని తావులోయ్
వన్నెవన్నెల చిలుకలోయ్,
సీతాకోక చిలుకలోయ్.
అందమంటే వానిదే,
స్నేహమంటే వానిదే.
పూవు లందం చెట్లపైనా,
చిలుక లందం పూలపైనా.
తియ్యని తేనెల సారం
చిలుకకు ప్రాణాధారం
పువ్వు చూపు ఆదరణం
పూజాతికి విస్తరణం
పువ్వు లేదో చిలుక లేదు
చిలుక లేదో పువ్వు లేదు.
పూ, చిలుకల సంబంధం
యుగ యుగాల అనుబంధం.