తల్లివి నీవే తండ్రివి నీవే

తల్లివి నీవే తండ్రివి నీవే

చల్లగ కరుణించే దైవము నీవే || తల్లివి ||

వేడుకొన్న దయదలైచే వెంకటరమణా

తోడునీడవై మాపై చూపుము కరుణా

వెంకట రమణా, వెంకటరమణా!

నీ కన్నా మాకెవరూ లేనే లేరూ

నీ దీవెనలే మాకు చాలు వెంకట రమణా || తల్లివి ||

గాలిలోన దీపంలా ఉన్నామయ్యా - నీ

జాలివల్లనే వెలుగు నిలిచేనయ్యా

నీ పూజకొరకు పూచినా పువ్వులమయ్యా

నీ పాదాలే మాకు శరణు వెంకటరమణా

వెంకట రమణా వెంకట రమణా || తల్లివి ||