ముకుందరామ పాహిమాం

శ్రీరామా....రామా!
రామరామ పాహిమాం! ముకుందరామ పాహిమాం
రమస్మరణ చేయరే! ముకుందరామపాహొమాం
దానవులను సంహరించి తాపసులను సంరక్షించి
విల్లువంచి సీతనే వరించె రామ పాహిమాం
||ముకుంద||

పితృవాక్యపాలనకై రాజ్యమే త్యజించి
కాననమ్ము లాశ్రయించె రామ రామ పాహిమాం
||ముకుంద||

మాయలేడి జూచి సీత భ్రాంతి చెంది కోరగా
వెంబడించె రాముడే రామరామ పాహిమాం
||ముకుంద||

భిక్షురూపమందు వచ్చి రావణుండుమాయచేసి
అపహరించె సీతనే రారామ పాహిమాం
||ముకుంద||

శోకమూర్తి సీతనే అశోకవనమ్ములో
వాయు పుతృడోదార్చె రామ రామ పాహిమాం
||ముకుంద||

వార్దిపైన వారధి నిర్మించి దాశరధి
రావణుని సంహరించె రామ రామ పాహిమాం
||ముకుంద||

ప్రజాకోటి పూజలంది రామచంద్రుడే అయోధ్య
పాలనమ్ము సాగించెహ్ రామ రామ పాహిమాం పట్టాభి రామ పాహిమాం
రామ రామ పాహిమాం పట్టాభిరామ పాహిమాం
రామ రామ పాహిమాం పట్టాభిరామ పాహిమాం