కనిపించుమురా - మహదేవా
కన్నులారా నినుగాంచితారింతురా
||కని||
కనిపించెదవని - భువనంబంతయు
కలయవెదకినిను గననైతినిరా
నీ నెలవేదో - నీ రూపమేదో
ఆనతీయరా - జగదీకవిభో
||కని||
పలుకు పలుకుమని పిలచిననాతో
పలుకవేమిరా పరమేశా
పలుకరార - నీ పలుకే వినియెద
కలిగిన నా మది - కలతదీరగా
||కని||