నవరసమ్ములు నాట్యమాడగ

శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పాఱిన భాగ్యసీమయి
వరలీనది యీ భరతఖండము భక్తిపాడర తమ్ముడా!
వేదశాఖలు పెరిగె నిచ్చట ఆదికావ్యం చిందె నిచ్చట
బాదరాయణ పరమ రుషులకు పాదు సుమ్మిరి చెల్లెలా!

విసిన బంధుర వృక్షనాటిక ఉపనిషన్మదు వొలికె నిచ్చట
విపుల తత్వమ్ము విస్తరించిన వినుల తలమిదె తమ్ముడా!
సూత్ర యుగముల సుద్ధవాసన క్షాత్ర యుగముల శౌర్యచండిమ
దిత్రదాస్యమునీ చరిత్రల చెఱిగిపోయెనె చెల్లెలా!

మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమత్తీ
పాలతీయని బాలభారతి పదము పాడర తమ్ముడా!
నవరసమ్ములు నాట్యమాడగ చివురు పలుకులు
చెవుల విందుగ కవిత లల్లిన కాంతి హృదముల
గారైవింపవె చెల్లెలా!

దేశగర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ
దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా!
పాండవీయుల పదును కత్తులు నుండి మఱసిన మహితి
రణకథ కండగల చిక్కని తెఱంగుల కలిసి పాడవె చెల్లెలా!

లోకంతకు కాక పెట్టిన కాకతీయుల కదన పాండితి చీకిపోవని
చేవ పదముల చేర్చిపాడర తమ్ముడా!తుంగభద్రా భంగములతో
పొంగి నింగిని పొడిచి త్రుళ్ళి భంగపడని తెలుగు నాధుల
పాట పాడవె చెల్లెలా!