షేక్ షికాలా షేక్‌షికాలా షేకులన్ని

పల్లవి

[అతడు] రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా
కదిలారా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా వయ్యారిపావురాయి పిట్టలా
వొదిగిపో మేనకా బందారు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డులా
ఇలా ఇలా ఇలా
షేక్ షికాలా షేక్‌షికాలా షేకులన్ని నాకుదక్కాలు
అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీది చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగువెయ్ పదిలోకాలదురునొయ్ అన్నదేతారక మంత్రం
[ఆమె] యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మాఓటుతో సీటుకే
ఎరవేసుకో ||2||||షేక్‌షికాలా||


చరణం 1


[అతడు] కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా
[ఆమె] ఎత్తిపెట్టరా విల్లు ఎక్కుపెట్టారా గురిచూసి కొట్టరా
[అతడు] వెండి సోకుతో వైతరణి ఓడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తే
[ఆమె] పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా
[అతడు] ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేసావంటే పోయే దేది
లేనేలేదు అన్నదే తారక మంత్రం
[ఆమె] కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా
అమృతమే జుర్రేసుకో ||2||||షేక్‌షకాలా||


చరణం 2


[అతడు] ఆనాటి రాముడు ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ
నరకాన్ని చెడుగుడు ఆడేసాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు
ఉద్యమాలలో రసోధ్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతోకలిసుంట
[అతడు] సంఘమించరా పురోగమించరా అధిగమించరా ఆ ఆ ఆ...
[అతడు] రింగు రోడ్డులొ అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా
[ఆమె] ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఆ ఆ ఆ
[అతడు] ఏమబ్బున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కధంతొక్కి ఆటాపాటా
కానిచ్చేయా లన్నదే తీరక మంత్రం
[ఆమె] దొంగ యమా దొంగయమా దోచేసుకో
యమ బోల్టుగ కోటనే దున్నేసుకో ||2||||యంగ్ యమా||