గోపాల మాం పాలయా! కృపాలయా ||గోపా ||
గోపీ విధేయా! సురమౌనిగేయా ||గోపా ||
నీరధి గంభీర! నిగమాంతసంచార
ధారిత మందర! దానవసంహార
నీరజనేత్ర! ఘనలీల! లీలా గోపాలా!
రాధికాసుమ సాయకా! సర్వాధికా!
సాధక ఫలదాయకా! జగదాధారా!
బాధితభవజాలా! మాధుర్యగుణశీలా!
మోదిత ప్రజ బాలా! ములళీ విలోలా!
||గోపా||
ఇందిర మందిర నందకిశోరా!
దాస చందన! ఖగస్యందన!
సదానంద! సువిధానా!
అనాది నిధనా! అమోఘ కదనా
కంత్కనక పరిధానా!||గోపా||