నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే

పల్లవి

[అతడు] నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాగుండెల్లో దడదడలే నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాఅందంలో అలజడులే నీవల్లే
నాచంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీవల్లే
నా మాటల్లో ఆటల్లో రాగంలో మలిపులు నీవల్లే ||నీవల్లే నీవల్లె||

చరణం 1

[ఆమె] మామూలు రూపు మామూలు తీరు ఏముంది నీలోన
ఆకర్షణ ఏదో ఉంది పడిపోయా నీపైనా
నిన్ను తలచుకొనే అలవాటే మారెను వ్యసనమై నిన్నుగెలుచుకొనే
ఈ ఆటే తెలిసెను ప్రణయమై ||నీవల్లే నీవల్లె||

చరణం 2

[ఆమె] ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువ్వి వెల్లావు చల్లగా
ఆ నవ్వుతో ఆ చూపుతో కల్లోలం ఒళ్ళంతా
కొంతకరకుతనం కరుణగుణం కలిపితే నువ్వేలే
కొంటెమనసుతనం మనిషివలే ఎదిగితే నువ్వేలే
[అతడు] నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నాగుండెల్లో దడదడల్ నీవల్లే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా కళ్ళలో కొత్త కధలే నీవల్లే
నా చేతుల్లో చేతల్లో నడకల్లో వణుకులు నీవల్లే
నా మాటలో ఆటల్లో మార్గంలో మార్పులు నీవల్లే ||నీవల్లే నీవల్లే||